ముఖంపైన రంధ్రాలు తగ్గాలంటే...
ముందుగా ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. రెండు టీ స్పూన్ల ఆపిల్ సీడర్ వెనిగర్‌లో కాటన్ బాల్స్‌ని ముంచి ముఖమంతా తుడిచి 20 నిమిషాల తర్వాత తిరిగి గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇది మంచి స్కిన్ టోనర్‌లా పనిచేయడమే కాకుండా దీన్ని క్రమం తప్పకుండా రెండు వారాలపాటు ఉదయం, సాయంత్రం చేస్తే ముఖంపైన జిడ్డు, రంధ్రాలు, మొటిమల తాలూకు నల్లమచ్చలు, యాక్నే సమస్య లు తగ్గి చర్మం కాంతివంతంగా ఉంటుంది.