ఆపిల్ ముక్కలను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు వారాలపాటు చేస్తే ముఖంపైన ముడతలు తగ్గి చర్మ నిగారింపు పెరుగుతుంది.
బాగా పండిన టొమాటోలో, అయిదారు టీ స్పూన్ల పచ్చిపాలు తీసుకుని రెండిటినీ కలిపి గ్రైండ్ చేసి వడకట్టాలి. ఈ మిశ్రమాన్ని 10 నిమిషాలపాటు ఫ్రిడ్జ్‌లో ఉంచాక బయటకు తీసి అందులో కాటన్‌బాల్స్‌ని ముంచి ముఖమంతా అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.


