నా వయస్సు 20. బరువు 43 కిలోలు. మంచి పౌష్టికాహారం తింటాను కాని, బాగా సన్నగా ఉంటాను. ఛాతీకూడా బాగా తక్కువ. ఈ రెండూ పెరిగేలా మంచి ఆయుర్వేద మందులు తెలియ జేయ ప్రార్థన.
ముందు జనరల్ చెకప్ చేయించుకుని, ఆరోగ్యపరమైన సమస్యలు లేవని నిర్థారించుకోండి. అలాగే స్త్రీల హార్మోన్లకు సంబంధించి, గర్భాశయానికి, నెలసరికి సంబంధించి అన్నీ ఆరోగ్యప్రదంగా ఉండేట్టు శ్రద్ధ వహించండి. అనంతరం- ఈ కింది మందులు రెండునెలలు వాడి ప్రభావాన్ని పరిశీలించుకోండి.
ఆరోగ్యవర్థని మాత్రలు: ఉదయం 1, రాత్రి 1
శతావరీ చూర్ణం: 5 గ్రాముల చూర్ణంలో రెండు చెంచాల ఆవునెయ్యి, కొంచెం శర్కర కలిపి ఆహారానికి ఒక గంట ముందు సేవించండి.
కుమార్యాసవ: నాలుగు చెంచాల మందుకి సమానంగా నీళ్లుకలిపి, రెండుపూటలా ఏదైనా తిన్న తర్వాత తాగండి.
దానిమ్మకాయని దంచి, ముద్దలా చేసి రాత్రిపూట ఛాతీపై పూసుకుని, ఆ మరుసటి దినం గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి.


