గాల్‌బ్లాడర్‌లో స్టోన్స్...మందులతో కరుగుతాయా?

  • PDF
  • Print
  • E-mail
నాకు కుడివైపు కడుపులో నొప్పిగా ఉందని డాక్టర్ దగ్గరకెళితే స్కానింగ్ చేసి గాల్‌బ్లాడర్‌లో చిన్న చిన్న రాళ్లు ఉన్నాయని చెప్పారు. నొప్పి ఎక్కువగా ఉంటే ఆపరేషన్ చేయాలన్నారు. నాకు ఆపరేషన్ చేయించుకోవడం ఇష్టం లేదు. దయచేసి ఆపరేషన్ లేకుండా నా సమస్య తగ్గడానికి హోమియోలో ఏమైనా మందులున్నాయా?

గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడటం వలన నొప్పితోబాటు ఆహారంలోని కొవ్వు పదార్థాలు సరిగా జీర్ణం కావు. దీనివలన మరిన్ని సమస్యలు ఏర్పడతాయి. గాల్‌బ్లాడర్‌లోని రాళ్లు కరిగిపోయేందుకు హోమియోలో మంచి మందులున్నాయి. అయితే రాళ్ల పరిమాణం చిన్నగా ఉన్నట్లైతేనే మందులు ఉపకరిస్తాయి. 8 మి.మీ. కి మించి ఉంటే మందులతో కరగడం కష్టం. మీరు రోజూ రెండుపూటలా కొలిస్టిరినమ్ 3గీ పొటెన్సీలో 2 పిల్స్ వాడుతూ బెంబెరిస్ వల్గారిస్ 30 పొటెన్సీలో రోజూ మధ్యాహ్నం ఒక డోసు చొప్పున మూడు రోజులు వాడి ఒక వారం గ్యాప్ ఇచ్చి అదేవిధంగా వాడండి. నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు బెల్లడోనా 1 ఎం. పొటెన్సీలో వాడండి.
 

Health - ఆరోగ్యం

Districts