ఒకసారి నేను కిందపడినప్పుడు నడుము బెణికింది. అప్పుడు నొప్పి అంతగా అనిపించలేదు కాని ఆరు నెలల తర్వాత నడుము సలపటం మొదలైంది. డాక్టర్‌ను సంప్రదిస్తే ఎక్సర్‌సైజులు చేయమని సూచించారు. అవసరం అయితే వాడమని కొన్ని పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. నాకు వ్యాయామం చేయడానికి సమయం లేదు. హోమియోపతిలో ఏమైనా మందులు ఉంటే సూచించగలరు.
మీకు ఉన్న సమస్య కేవలం వ్యాయామం అంటే ఫిజియోథెరపీ ద్వారానే తగ్గుతుందని డాక్టర్ చెప్పారు కాబట్టి వ్యాయామం చేయడం తప్పనిసరి. వీలైనంత వరకు మందులు వాడకుండా వ్యాయామం చేయడమే మంచిది. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే హైపరికమ్ 1 ఎం. వారానికి ఒక డోసు, ఆర్నికా 200 రోజు ఒక డోసు చొప్పున రెండు వారాలపాటు వాడండి.


