‘యురేనియం’ అంటే ఏమిటి? - What is Uranium

  • PDF
  • Print
  • E-mail

మనకు బాంబుల గురించి, వాటికి అవసరమైన లోహాల గురించి ప్రసక్తి వచ్చినప్పుడల్లా‘ యురేనియం’ పేరు వినబడుతుంది. అసలు యురేనియం అంటే ఏమిటి? అనే విషయం తెలుసుకుందాం.

యురేనియం అంటే ధార్మికశక్తి అధికంగా ఉంటే మూలకం. రసాయనికపరంగా వ్యవహరించేటప్పుడు దీనికి ’్ఖ’ అనే చిహ్నం వాడతారు. యురేనియంలో అధిక భాగం వెండిరంగులో ఉండే అనేక పసుపురంగులోని ఛాయలు మెరుస్తాయి. అయితే యురేనియం అంత ఎక్కువగా దొరకదు. కానీ ఖనిజాల కోసం భూమిని తొలిచి వెదుకుతున్న సమయంలో యురేనియం నిల్వల సంగతి సులభంగా తెలిసిపోతుంది. కారణం యురేనియం ధార్మిక శక్తి ప్రభావం ఆ ఖనిజపు నిల్వలు ఉన్నచోట స్పష్టంగా వ్యక్తమవుతుంది. సాంకే తిక పరికరాలకు ఈ ప్రభావం అందుతుంది. యురేనియంలోని అణువులు ఇతర లోహాల అణువుల కన్నా బరువుగా ఉంటాయి.

యురేనియం ఐసోటోప్‌లలోని అణువులను రెండు భాగాలుగా విడదీయవచ్చు. దీనివల్ల విపరీతమైన శక్తి విడుదలవుతుంది. అణుబాంబుల తయారీకి శుద్ధిచేసిన యురేనియాన్ని వాడతారు. అణు రియాక్టర్లలో విద్యుదుత్పాదనకూ వాడతారు. యురేనియం నుంచి ప్లుటోనియాన్ని కూడా రాబట్టవచ్చు.