
సౌర కుటుంబంలో సూర్యుని తరువాత రెండవ గ్రహం ‘వీనస్’. సూర్యుని చుట్టూ తిరగటానికి ఈ గ్రహానికి 225 రోజులు పడుతుంది. తన చుట్టూ తాను తిరగటానికి 243 రోజులు పడుతుంది. భూమికి అతి సమీపంగా ఉన్న గ్రహం వీనస్. ఒక్కోసారి ఆకాశంలో స్పష్టంగా కనిపిస్తుంటుంది కూడ. ఈ గ్రహం చుట్టూ దట్టమైన మేఘాలు ఉంటాయి.
కాబట్టి టెలిస్కాప్ లేకుండా కనిపించదు. వెనీరా అనే అంతరిక్ష నౌకలు ‘వీనస్’ గ్రహం మీద దిగి ఎంతో విలువైన సమాచారాన్ని పంపాయి. అయితే ‘మేర్నియర్ 10’ అనే అంతరిక్ష నౌక వీనస్ గురించి సమగ్ర సమాచారాన్ని పంపగలిగింది. భూమి మీద ఉన్నట్లే వీనస్ మీద కూడా అగ్ని పర్వతాలు, కొండలు, లోయలు ఉన్నాయి. ఆఫ్రికా ‘రిఫ్ట్ వ్యాలీ’ వలే భూమి చీలినట్టు లోయలున్నాయి. వీనస్ ఉపరితలం మీద ఉష్ణోగ్రత 896 డిగ్రీల ఫారెన్ హీట్ ఉంటుంది. ఈ గ్రహం మీద కార్బన్ డై ఆక్సైడ్ దట్టంగా అలుముకుని ఉంది. చుట్టూ ఉన్న మేఘాలు సల్ప్యూరిక్ యాసిడ్ మయం. ఇది జీవులకు అనువైన వాతావరణం కాదు.


