నెంబర్‌ను అలాగే ఉంచుకుని, నెట్ వర్క్‌ను మార్చుకునే సదుపాయం దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. అయితే ఏ సర్కిల్‌లో అయితే ఉన్నామో ఆ సర్కిల్ పరిధిలో మాత్రమే ఇలా మార్చుకోడానికి వీలవుతుంది. (ఉదా: ఆంధ్రప్రదేశ్ అంతా కలిపి ఒక సర్కిల్).
1- మొదట మీరు ఎనిమిది అంకెల యు.పి.సి. నెంబరు పొందాలి. యు.పి.సి. అంటే యునిక్ పోర్టింగ్ కోడ్. 1900 అనే నెంబరుకి PORT < మీ మొబైల్ నెంబర్ ా అని ఎస్.ఎం.ఎస్. పంపితే మీకు యు.పి.సి. నెంబరు వస్తుంది.
2- యు.పి.సి.నెంబరుతో మీరు కొత్త నెట్‌వర్క్ ఆపరేటర్‌ను సంప్రదించాలి. అక్కడ మీరు అవసరమైన పత్రాలను పూర్తిచేసి, మీ గుర్తింపు రుజువులను పొందుపరచాలి.
3- నెట్‌వర్క్ మార్పిడి ప్రక్రియ ప్రారంభం అయినట్లు కొత్త ఆపరేటర్ నుంచి మీకు ఏ రోజైనా ఎస్.ఎం.ఎస్. రావచ్చు. అంత వరకు వేచి ఉండాలి. నెట్‌వర్క్ మార్పు జరుగుతున్న సమయంలో గరిష్టంగా మూడు గంటల పాటు మీ ఫోన్ నెంబరు అచేతనావ స్థలో ఉంటుంది.
4- ఆ దశ పూర్తయిన వెంటనే పాత నెంబరుతో మీకు కొత్త ఆపరేటర్ సిమ్ లభ్యమౌతుంది.
5- ఈ ప్రాసెస్ అంతా పూర్తవడానికి ఆరు లేదా ఏడు రోజులకు మించి సమయం పట్టదు.
దేశంలో 70 కోట్ల మందికి పైగా మొబైల్ ఫోన్ వాడుతున్నారు. వారిలో 12 కోట్ల మంది కొత్తగా వచ్చిన సదుపాయంతో తమ నెట్‌వర్క్‌ను మార్చుకోబోతు న్నారని ‘హిందూస్థాన్ టైమ్స్-మార్స్’ సర్వేలో వెల్లడయింది. అంటే - ప్రతి ఆరుగురిలో ఒకరు పాత నెంబరుతో కొత్త నెట్‌వర్క్‌లోకి వెళ్లబోతున్నారు.
నెట్‌వర్క్ మార్చుకుంటున్నప్పుడు
{పీ-పెయిడ్ కస్టమర్ల బ్యాలెన్స్ / టాక్ టైమ్ కొత్త నెట్‌వర్క్‌కు బదిలీ కాదు.
పోస్ట్ పెయిడ్ కస్టమర్లు కొత్త నెట్‌వర్క్‌లోకి మారాలంటే ముందుగా తమ పాత బకాయిలన్నిటినీ పూర్తిగా చెల్లించాలి.
CDMA నుంచి GSM కు లేదా GSM నుంచి CDMA కు మారడం కుదరదు.
మూడు నెలలకు ఒకసారి మాత్రమే నెట్‌వర్క్ మార్చుకునే వీలుంటుంది.


