బొబ్బట్లు ఆంధ్ర వారి పండుగ వంటల్లో ,పెళ్లి వంటల్లో గాని మరే ఇతర శుభ కార్యాలలో ఐన తయారు చేసే వంటకం.
కావలసిన పదార్థాలు(నలుగురు మనుషులకు సరిపడా): 



- సెనగపవు–>పావు కిలో
- బెల్లం/పంచదార–>పావు కిలో
- నెయ్యి/నూనె–>తగినంత
- ఎలాక్కయాల పొడి–>రెండు చిన్న చిమ్చాలు
- మైద పిండి–>పావు కిలో కన్నా కాస్త ఎక్కువ
తయారు చేయు విధానం:
- ముందుగ సెనగపప్పు తగినంత నీలు పోసి మెత్తగా ఉడికించుకోవాలి.
- పప్పు చల్లారాక పంచదార/ బెల్లం కొద్దికొద్దిగా వేస్తూమెత్తగా రుబ్బుకోవాలి.
- ఇప్పుడు మైద పిండి లో చిటికెడు ఉప్పు కలిపి తగినంత నెయ్యి/నూనె వేస్కుంటూ మెత్తగా పూరి పిండి మాదిరిగా కలుపుకోవాలి.కొంచం సేపు నాననివ్వాలి.
- ఇప్పుడు మైద పిండి ఉండలు గ చేస్కుని కాస్త వెడల్పు గ నొక్కుకుని అందులో సెనగపిండి తో చేస్కున్న పూర్ణం కొద్దిగా ఉండలాగా చేసి మైద పిండి ముద్ద తో కప్పి దాన్ని ఒక కవర్ మిద చేతిని నీతితో /నూనెతో నో తడుపుకుని చపాతీ ల వత్తుకోవాలి.
- ఇప్పుడు వత్తిన దాన్ని నేతితో/నూనెతో నో కాల్చుకుంటే పీనం మీద నోరు ఊరించే కమ్మటి బొబ్బట్లు రెడీ!
మనం చేసే ఆంధ్ర బొబ్బట్లకి పూర్ణం సెనగపప్పు తో చేస్తే కన్నడిగులు కందిపప్పు తో చేస్తారు. అలా ఆలోచిస్తే నాకు ఇంకొన్ని రకాల బొబ్బట్లు తోచాయి. అవి ట్రై చేస్తే అదరహో అనిపించాయి. అందుకే మీకు పరిచయం చేద్దామనుకున్న ఆ రుచులని.
1.పెసర పప్పు పూర్ణం బొబ్బట్లు:
దీనిలో సెనగపప్పు కి బదులు పెసర ర పప్పు తో పుర్నాన్ని చేకోవాలి. మిగితదంతా మాములుగా బొబ్బట్లు చేసినట్టే చేయాలి.
2 .డ్రై ఫ్రుట్ బొబ్బట్లు:
దీనిలో ఖర్జూరాలు,జీడిపప్పు,కిష్మిష్,బాదం పప్పు,గసాలు,పిస్తా పప్పు ముందుగ దోరగా నేతిలో వేయించి పొడి చేస్కుని బెల్లం పాకం లో వేసి దగ్గర అయ్యేవరకు ఉంచాలి.
తర్వాత ఈ పుర్నాన్ని మైద పిండి ఉండాలో పెట్టి చపాతీలాగ వత్తుకుని నేతితో పెనం మీద కాల్చాలి.
3.విటమిన్ రిచ్ బొబ్బట్లు:
దీనిలో కార్రోట్,బీట్రూట్ మెత్తగ బ్రుబ్బుకుని నీళ్ళు లేకుండా చూస్కుని నేతిలో దోరగా వెయ్న్చి, పంచదార చేర్చి మెత్తగ పూర్ణం ల చేసి మైద పిండి ముద్ద లో పెట్టి కల్చుకుంటే పెనం మీద పోషకాహార బొబ్బట్లు రెడీ!


